భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం

Godavari recedes at Bhadrachalam– ఊపిరి పీల్చుకున్న వరద బాధితులు
నవతెలంగాణ – భద్రాచలం
భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. ఉదయం 10 గంటలకు 32 అడుగులు ఉన్న గోదావరి, రాత్రి 7 గంటలకు 28.40 అడుగులకు చేరుకుంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి కూడా అదే రీతిన తగ్గటంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సారి మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవహించింది. ఇక వరదల నెలగా భావించే ఆగస్టులోకి ప్రవేశించడంతో మళ్లీ టెన్షన్‌ అలముకుంది. ఇప్పటికే అనేక నష్టాలను, ఇక్కట్లను చవిచూసిన గోదావరి ప్రాంత ప్రజలు.. మున్ముందు ఎలా ఉండబోతుందోనని ఆందోళనలో ఉన్నారు.
ఇదిలా ఉండగా గోదావరి వరదలతో పునరావాస కేంద్రాలకు తరలిన వరద బాధితులు ఇంటి ముఖం పడుతున్నారు. ఇంట్లో పేరుకుపోయిన బురదను తొలగించే పనిలో నిమగమయ్యారు.

Spread the love