ఖమ్మం జిల్లా రైతులతో ఎంపీ రవిచంద్ర భేటీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాపడ్‌పల్లి-జాన్‌పహాడ్‌-మిర్యాలగూడ ప్రతిపాదిత రైల్వేలైన్‌ అలైన్మెంట్‌ మార్చాలని కోరుతూ ఖమ్మంరూరల్‌, ముదిగొండ, నేలకొండపల్లి మండలాలకు చెందిన రైతులు సోమవారం ఎంపీ రవిచంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదిత రైల్వేలైన్‌ అలైన్మెంట్‌ వల్ల బడుగు, బలహీన వర్గాలకు చెందిన సన్న, చిన్న కారు రైతులకే ఎక్కువగా నష్టం వాటిల్లనున్నందని తెలిపారు. అందువల్ల దీన్ని మార్చాల్సిన ఆవశ్యకతపై గురించి మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డిలతో కలిసి సీఎం దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేస్తానని హామీనిచ్చారు.

Spread the love