
బోర్గం పి ప్రభుత్వ పాఠశాలకు చెందిన సాయి ప్రసన్న కి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎస్ జి ఎఫ్ టైక్వాండో ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది ఇటీవల వికారాబాద్ లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టైక్వాండో పోటీల్లో అండర్ 14 విభాగంలో ప్రాతినిత్యం వహించి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శంకర్ సాయి ప్రసన్నను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ సందర్భంగా టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య చేతుల మీదగా ఘనంగా సన్మానించారు.