నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బ్యాగ్ పంపిణీ చేయాలని సర్కారు భావిస్తోంది. వచ్చే నెలలో కేంద్రం ముందు దీన్ని ప్రతిపాదించనుంది. ఇందుకు ఆమోదం తెలిపితే రూ.290 కోట్ల ఖర్చులో కేంద్రం 60% వాటా ఇస్తుంది. ఈ స్కీం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26వేల ప్రభుత్వ బడుల్లోని 25 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం కలగనుంది.