నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వారు ప్రాథమిక చికిత్స అందించి, ఇంటికి తరలించారు.