Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్"గోటు టు విలేజ్ - మాదిగ పల్లెలకు తరలండి

“గోటు టు విలేజ్ – మాదిగ పల్లెలకు తరలండి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్  : పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు విద్యా , సంస్థగత నిర్మాణం ,జెండా ఆవిష్కరణల కోసం మాదిగ పల్లెల్లోకి ప్రతి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు వెళ్లి అక్కడి మాదిగ యువతను చైతన్యం చేసే విధంగా ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జి బిర్రు మహేందర్ మాదిగ అన్నారు. ఆలేరు  నియోజకవర్గం ఆలేరు మండలం శారాజిపేట గ్రామము ఆలేరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కందుల నరసింగరావు మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నామని, ఈ సాధించుకున్న వర్గీకరణ ఫలాలను మన జాతి బిడ్డలు అందిపుచ్చుకునేలా వారిని చైతన్యం చేయడం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఇచ్చిన కార్యచరణలో భాగంగా “గో టు విలేజ్ మాదిగ పల్లెలకు తరలండి” కార్యక్రమం ఈనెల 25 నుండి మొదలుకొని జూలై 05 వరకు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.విద్య, సంస్థాగత నిర్మాణం, జెండా ఆవిష్కరణలు, గ్రామ స్థాయి కమిటీల బలోపేతం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.గ్రామాల్లో ఇంకా ఎమ్మార్పీఎస్ కమిటీలు లేని చోట నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని,ఎమ్మార్పీఎస్ గద్దెల నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, విహెచ్పీఎస్ అనుబంధ సంఘాలకు నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఆడపు కరుణాకర్ మాదిగ,అధికార ప్రతినిధిగా జేరుపోతుల పవన్ కళ్యాణ్ మాదిగ,ప్రధాన కార్యదర్శిగా కంతి మహేష్ మాదిగ, కార్యదర్శిగా మలపురం కిషోర్ మాదిగ, సహాయ కార్యదర్శిగా కంతి రాజకుమార్ మాదిగను ఎంపిక చేశారు.అలాగే కమిటీ సభ్యులుగా ఆడపు వంశీ మాదిగ, పుట్టల సంపత్ మాదిగ, కంతి నవీన్ మాదిగ, కంతి బన్ని మాదిగ, కంతి సుధీర్ మాదిగలను ఎన్నుకున్నారు.

ఎమ్మెస్‌ఎఫ్ గ్రామ అధ్యక్షుడిగా కళ్లెం సాయికుమార్ మాదిగ, అధికార ప్రతినిధిగా ఆడెపు వంశీ మాదిగ, కార్యదర్శిగా పుట్టల అర్జున్ మాదిగ, సహాయ కార్యదర్శిగా కళ్లెపు దీక్షిత్ మాదిగను ఎన్నుకున్నారు.మిటీ సభ్యులుగా బంగారు సాయి తేజ మాదిగ, కళ్లెం రవి మాదిగ, పుట్టల సాగర్ మాదిగ, పుట్టల నితీష్ మాదిగ, చిలుకు సిద్దు మాదిగ, కంతి భాను మాదిగలను ఎంపిక చేశారు. విహెచ్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పుట్టల దేవేందర్ మాదిగను ఎన్నుకోగా, గ్రామం నుంచి మండల కమిటీలోకి సాయి మాదిగను తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, విహెచ్పీఎస్ నాయకులు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -