Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెన్షనర్లకు ఇ.హెచ్.ఎస్ కార్డు పొందుటకు 'వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం

పెన్షనర్లకు ఇ.హెచ్.ఎస్ కార్డు పొందుటకు ‘వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం

- Advertisement -

 నవతెలంగాణ – ఆలేరు టౌను :  పెన్షనర్ల ఆరోగ్య కార్డు కోసం దరఖాస్తు వివరాలను  నమోదు చేయాలని 31  తేదీని చివరి తేదీగా ప్రకటించారని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బొమ్మగంటి బాలరాజ్, కడారి రమేష్  ఆలేరు పట్టణంలో శుక్రవారం విలేకర్లకు ప్రకటనలో తెలియజేశారు. వయోవృద్ధులు అనారోగ్యాలతో ఉన్న పెన్షనర్లు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లి  హెల్త్ కార్డుల ‘వివరాలు  సమర్పించుటకు ఇబ్బందులు కలుగుతాయని పెన్షనర్ల సంఘాలు విజ్ఞప్తి చేసిన మేరకు,  మెమో ఇష్యూ చేశారన్నారు.  ఈ మెమో ప్రకారం గడువు తేదీతో నిమిత్తం లేకుండా హెల్త్ కార్డు లోని వివరాలు నమోదు,  పెన్షన్ చెల్లించే  అధికారులకు ఎస్ టి ఓ / పిఏఓలకు  సమర్పించవచ్చని, ఆరోగ్య కార్డులు సవరణకు అవకాశం ఇచ్చినందుకు వర్షం వ్యక్తం చేశారు. అతి తొందరలో ఐహెచ్ఎస్ కార్డులు( క్యాష్ లెస్) ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -