సత్తుపల్లిలో ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ

నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొత్తగా ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.25 కోట్లతో కాలేజీ నిర్మాణానికి అనుమతిలిచ్చినట్టు తెలి పారు. ఇందుకవసరమైన అన్ని చర్య లు తీసుకోవాలని డీఎంఈ, టీఎస్‌ ఎంఐడీసీ ఎమ్‌డీని ఆదేశించారు.
తొర్రూరులో వంద పడకల ఆస్పత్రి
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూ రులో 100 పడకల ఏరియా ఆస్పత్రి ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ మార్చి 2న రాసిన లేఖను ఆమోదిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్త ర్వులు జారీ చేశారు. రూ.36 కోట్లను మంజూరు చేశారు. ఆస్పత్రి నిర్మాణా నికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని టీవీవీపీ కమిషనర్‌ ను ఆదేశించారు.

Spread the love