ఒకే గొడుగు కింద ప్రభుత్వ సేవలు

– నేటి నుంచి అందుబాటులోకి వార్డు కార్యాలయాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో సరికొత్త పాల న అందుబాటులోకి రానుంది. విద్యుత్‌, సివరేజ్‌, వాటర్‌, శానిటే షన్‌తోపాటు బస్తీలు కాలనీల్లో నెల కొన్న సమస్యలను ఒకే గొడుగు కింద పరిష్క రించేందుకు ప్రభుత్వం వార్డు కార్యా లయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అవి నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యల పరి ష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా నగరం లో వార్డు పాలన చెయ్యాలనే వినూత్న ఆలోచనతో వార్డు కార్యాల యాలకు శ్రీకారం చుట్టారు. వార్డు పరిపాలన అధికారితో పాటు మొ త్తంగా వార్డులో 10 మందిచొప్పున ఇంజనీరిం గ్‌, ఎంటో మాలోజి, యుబీడీ, యూసీడీ, టౌన్‌ప్లానింగ్‌ శానిటేషన్‌, విద్యుత్‌ జలమండలి రిసెప్షనిస్ట్‌ 150 వార్డుల లో అధికా రులు నిత్యం ప్రజలకు అందు బా టులో ఉండనున్నారు. దాంతో ప్రజా సమస్యలు అక్కడ ిక్కడే పరిష్కారం అవుతాయని అధికారులు అభిప్రాయ పడుతు న్నారు. అ యితే సమస్యలు ఎంత సమ యంలో ఎన్ని రోజుల్లో పరి ష్కారం చేయ్యాలనే అంశంపై సిటిజన్‌ చార్టర్‌ ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. కాచిగూడలో వార్డు కార్యాల యా న్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌ ప్రజలకు సుపరి పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ష్టాత్మ కంగా చేపట్టిన వార్డు కార్యాలయాలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర మునిసిపల్‌ పరిపాల, ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్‌ కాచిగూడ వార్డు కార్యాలయాన్ని ఉదయం 10 గంటలకు ప్రారం భిం చ నున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అ మీర్‌ పేట్‌ బీకేగుడా వార్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. హౌం మంత్రి మహమూద్‌ అలీ ఆజాంపుర వార్డు కార్యాల యాన్ని ప్రారంభించనున్నారు. అంతేకా కుండా రాష్ట్ర పశు సంవర్ధ్డక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మోండా మార్కెట్‌ డివిజన్‌ రెజిమెంటల్‌ బజార్‌ వద్ద ఏర్పా టు చేసిన వార్డు కార్యాలయాన్ని ముం దుగా ప్రారంభి స్తా రు.ఆతర్వాతకవాడిగూడతాళ్ళబస్తి, గోషామహల్‌ బేగం బజార్‌లో ప్రారంభిస్తారు. మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి బంజారాహిల్స్‌ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించను న్నా రు. ఆ తర్వాత హిమాయత్‌ నగర్‌ మె ల్కోటే పార్కు పక్కన గల వార్డు కార్యాలయం ఎల్‌.బీనగర్‌ లోగోజిగూడ, రామం తపూర్‌ వివేక్‌ నగర్‌లో వార్డు కార్యా లయాలను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రారంభించను న్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంత్రులు, మేయర్‌, శాస న సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొ రేటర్లు, వార్డు కా ర్యాలయాలను ఉదయం 10గంటలకు ప్రారంభించనున్నారు.

Spread the love