గౌడ సంఘం కమ్యూనిటీ హల్ పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ -దుబ్బాక రూరల్
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల శుక్రవారం గ్రామ సర్పంచ్ బండమీది బాలమణి గౌడ సంఘం సభ్యులతో కలిసి  గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. కమిటీ హల్ నిర్మాణానికి మెదక్ ఎంపీ సహకరించడం పట్ల గౌడ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజేందర్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు దుబ్బారాజా గౌడ్, రాగుల సంతోష్ గౌడ్, చిన్న నారా గౌడ్, యాద గౌడ్, బాల్ లింగా గౌడ్ తదితరులు ఉన్నారు.
Spread the love