సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని హనుమాన్ టెకిడి బస్తీ దవాఖాన డాక్టర్ నిషా అన్నారు. శుక్రవారం బస్తీ దావఖానాలో ఆమె మాట్లాడుతూ.. వర్షాలు మొదలైనందున సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ వ్యాధులతో పాటు విషజర్వాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వ్యాధుల రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ వ్యాపించే దోమ శుభ్రమైన నీటిలో పెరుగుతుంది అన్నారు. ఈ దోమ కుట్టిన పది రోజులకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి అని చెప్పారు. దోమ కుట్టిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే డెంగీగా అనుమానించాలి అన్నారు. డెంగీ బాధితులకు ప్లేట్‌లెట్స్‌ తగ్గి ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన వైద్యం పొందాలని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే డెంగీ రాకుండా చూసుకోవచ్చు అన్నారు. ఇంటి  పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు తమ దావఖాన పరిధిలో ఒక డెంగ్యూ కేసు వచ్చిందన్నారు. జలుబు జ్వరం అంటురోగాలు ప్రభులే ప్రమాదం ఉందని. జ్వరం రెండు రోజులు కంటే ఎక్కువ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు.
Spread the love