జీపీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

 GP workers should be given minimum wages– సీఐటీయూ మండల కన్వీనర్‌ బుట్టి బాలరాజు
– మండల కేంద్రంలో భిక్షాటన చేసిన కార్మికులు
నవతెలంగాణ-కందుకూరు
పంచాయతీ కార్మికులకు కనీస వేతన రూ. 19500 వేలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీన ర్‌ బుట్టి బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీ డీవో కార్యాలయం ఎదుట కొనసాగుతున్న గ్రామ పంచా యతీ కార్మికుల సమ్మె మంగళవారం 27వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా మ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరారు. సోమవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పంచాయతీ కార్మికుల సమస్యలు పరి ష్కరిస్తారని ఆశగా ఎదురుచూసినా ఎలాంటి ప్రకట నలు లేకపోవడంతో నిరాశ చెందా రని తెలిపారు. కార్మికులు కొన్నిరోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనంతరం కందుకూరు మండల కేంద్రంలో పం చాయతీ కార్మికులు భిక్షాటన చేశారు. ఈ కా ర్యక్రమం లో కారోబారుల సంఘం అధ్యక్షులు బాల రాజు, వివిధ గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.

Spread the love