గ్రామపంచాయతీ కార్మికుల నిరసన ప్రదర్శన, ఉరి తాళ్లు బిగించి నిరసన

నవతెలంగాణ- తల్లాడ

గత 27 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించి, ఉరి తాళ్ళు ధరించి తల్లాడ పురవీధులలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 27 రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న టెంట్ల కిందనే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. వానకు తడిసి ఎండకు ఎండి తమ గోడు వినిపించుకుందామన్న, తమను పాలకులు చర్చలకు పిలవడం లేదన్నారు. రోజు కూలి కన్నా తక్కువ వేతనం ఇస్తూ తమతో వెట్టి చాకి రీ చేయించుకుంటూ మల్టీపర్పస్ విధానంలో అన్ని రకాలుగా వినియోగించుకుంటూ, అధికారులు సర్పంచులు అవార్డులు పొందారని తమను గుర్తించిన దాఖలాలు లేవు అన్నారు ,శ్రమ ఒక రిది సోకు మరొకరిది చందంలా తయారయ్యిందన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయాలని అధికారులు, మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకు ,ప్రాణాలు పోయినా పరవాలేదని సమ్మె కొనసాగిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Spread the love