తీగలవాగు రిజర్వాయర్ ముంపు భూములపై గ్రామసభ

– రెండు రోజుల్లో అభ్యంతరాలు తెలపాలి
– అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అద్వాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నతరహా ప్రాజెక్టుయిన తిగలవాగు రిజర్వాయర్ నిర్మాణం ముంపునకు గురవుతున్న 84.34 ఎకరాల భూములను రెవెన్యూశాఖ అధికారులు గతంలో సర్వేలు నిర్వహించి తుది జాబితాను సైతం తయారు చేసి రెండేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అడ్వాలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి భూ నిర్వాసితుల జాబితాను ప్రకటించారు,రైతులకు ఎవరికైనా అభ్యంతారాలు ఉంటే 60 రోజుల్లో పిర్యాదు ద్వారా తెలపాలని అధికారులు ప్రకటించారు. దీంతో ఒకేసారి బాధిత రైతులు లేచి ఆందోళన చేపట్టారు.జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని మోకాపై  భూములు లేనివారికి ఉన్నట్టుగా ఉన్నవారికి తక్కువగా భూములు వచ్చాయని అభ్యంతారాలు తెలిపి ఇటీవల 22 రైతులు రిసర్వే నిర్వహించి తమకు న్యాయం చేసి అనర్హులను తొలగించాలని విన్నవించడంతో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రిసర్వే ప్రారంభించారు.దరఖాస్తులు చేసుకున్న రైతుల భూములను మోకాపై వెళ్లి సర్వేలు నిర్వహించారు.
అడ్వాలపల్లిలో గ్రామసభ..
శనివారం మండలంలోని అడ్వాలపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో మండల  తహశీల్దార్ రవి కుమార్ అధ్యక్షతన భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి తీగల వాగు ముంపునకు గురైతున్న బాధిత 71 మంది రైతులకు నోటీస్ లు జారీ చేశారు.రైతులకు ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో సోమవారం నాటికి తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తుల ద్వారా తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్యాం సుందర్, ఎంపిఓ విక్రమ్,ఆర్ఐ రాజశేఖర్ రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Spread the love