ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

Children's day celebration– ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు
నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానోఉపాధ్యాయులు,ఉపాధ్యాయబృందం ,విద్యార్థిని విదార్థులు భారత తొలి ప్రధాని పండిత్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా పలు తరగతులలో విద్యాబోధన చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు కవితా, శ్రీలక్ష్మి, గొపి,రాంకిషన్, వేల్పురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love