పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు: ఏడీ డాక్టర్ హేమంత్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని,వాతావరణ కాలుష్యాన్ని నివారించడం,భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించడం,భూ తాపాన్ని నివారించడం లో పచ్చని చెట్లు ప్రధాన పాత్రను పోషిస్తాయి స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.వసంత్ కుమార్ అన్నారు. వ్యవసాయ కళాశాల ఆద్వర్యంలో చివరి సంవత్సరం విద్యార్ధులు చే మండలంలోని నారాయణపురం లో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా శనివారం హరిత హారం,అమ్మ సేవా సదనం అనాధ ఆశ్రమం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరూ విధిగా తమ పరిసరాలలో పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలి అన్నారు. అనంతరం గ్రామం లోని వీధుల పక్కన, రైతు వేదికలో మొక్కలు నాటారు. ఈ సందర్శనలో  విద్యార్థులు పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించి, ఆ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం మరియు పనితీరును  తెలుసుకున్నారు. విద్యార్థులు వ్యవసాయ ఆధారిత గ్రామీణ పరిశ్రమలైన పప్పు మరియు కారం మిల్లు లను సందర్శించారు.  అనంతరం వ్యవసాయ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు అశ్వారావుపేట లోని అమ్మ సేవ సదన్ వృద్ధాశ్రమం ను సందర్శించి,అక్కడున్న వారి బాగోగులు గురించి తెలుసుకున్నారు.వారికి పండ్లు, స్వీట్స్ మరియు బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది మరియు విద్యార్థులు వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అనసూయ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం. రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుంచి సేవా భావాన్ని అలవర్చుకోవాలి అన్నారు. విద్యాధికులు అవకాశాన్ని బట్టి, నిరుపేదలకు చిన్నపాటి సాయాలైనాబాధ్యతగా చేయాలి అన్నారు. వృద్ధాశ్రమం నిర్వాహకుల సేవానిరతిని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం కార్యక్రమం అధికారులు డాక్టర్ ఎం.రాంప్రసాద్, డాక్టర్ పి.రెడ్డి ప్రియ,ఆర్. రమేష్, అధ్యాపకులు డాక్టర్ కే. శిరీష, శ్రీ జగదీశ్వర్, షేక్ అస్లాం మరియు కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love