– జాబితా విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు గురుకుల నియామక బోర్డు గురువారం విడుదల చేసింది.డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేసిన అధికారులు..తాజాగా జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్ https//treirb.cgg.gov.in/home లో అందుబాటులో ఉంచారు. జేఎల్ రాత పరీక్షలు గతేడాది ఆగస్టు 3 నుంచి 23 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. వికలాంగుల కేటగిరీ ఫలితాలు సైతం త్వరలోనే ప్రకటించనున్నారు.