నవతెలంగాణ – ( వేల్పూర్ ) ఆర్మూర్
పట్టణంలోని బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచిలో అవునుర్ జమునా (అమీనాపూర్ గ్రామం ) ఇన్సూరెన్స్ ఏజెంట్ సిలివేరి గంగాశ్రీనివాస్ ఏ సీ ఈ పాలసి ప్లాన్ గోల్ ప్రొటెక్షన్ లో చేర్పించారు. రూ..50 వేల చొప్పున కేవలం 2 కిస్తూ చెల్లించిన తరువాత అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో మరణించడంతో దీనికి మన బజాజ్ లైఫ్ లో ఎర్లీ క్లెయిమ్ అంటే క్లెయిమ్ పెట్టిన 20 రోజులో సాధారణ బీమా గా రూ.5,50,000 చెల్లించడంతో పాటు మిగతా 10 సంవత్సరాల ప్రీమియంలు కంపెనీ చెల్లిస్తూ నామినికి ప్రతి సంవత్సరం రూ.13,000/- చొప్పున ఇప్పటి నుండి 31 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుందని బ్రాంచ్ మేనేజర్ బుధవారం తెలిపారు. పాలసీ చివరి దశలో 31 సంవత్సరాలకు రూ.8,00,000 మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం రూ.87000 ప్రీమియంకు మొత్తం లబ్ధిగా రూ.22,53,000 ఆ కుటుంబానికి ఆర్థిక సాహయం అందుతుందని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. కంపెనీ తరుపున మేనేజర్ సిరిపురం సయేందర్ ఏఎస్ఓ వినోద్, ఏజెంట్ గంగాశ్రీనివాస్, సర్పంచ్ సౌందర్య నవీన్, ఉపసర్పంచ్ స్వామి గౌడ్, వార్డు సభ్యులు రాజు, వారి చేతుల మీదుగా రూ.5,50,000 చెక్కు నామినీకి అందజేసినారు. చెక్కు తీసుకున్న వారిలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



