హ్యాపీ ఎండింగ్‌

యశ్‌ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. కౌశిక్‌ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సిల్లీ మాంక్స్‌, హామ్స్‌ టెక్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్నాయి. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్ర టీజర్‌ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్‌ పల్లాల మాట్లాడుతూ,’కౌశిక్‌ చెప్పిన ఓ లైన్‌ నచ్చి చేసిన సినిమానే ఇది. మేం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు. దర్శకుడు కౌశిక్‌ మాట్లాడుతూ, ‘టీజర్‌ని కావాలనే షార్ట్‌గా కట్‌ చేశాం. ఏ మాత్రం లెంగ్త్‌ పెంచినా కంటెంట్‌ లీక్‌ అవుతుంది. అందుకే హీరోయిన్‌ను కూడా చూపించలేదు. ఈ టైటిల్‌ వినగానే చాలా ఊహించు కుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌.
ఈ కథను మూడేళ్ల క్రితం అనిల్‌కి చెప్పాను. అప్పుడే ఆయన చాలా నవ్వుకున్నారు. ఇక రైటర్‌ మ్యాజిక్‌ ఏంటనేది.. సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాతో యశ్‌ ఖచ్చితంగా ఓ ప్రామిసింగ్‌ యాక్టర్‌గా ఎదుగుతాడు. హీరోయిన్‌ పాత్ర సినిమా అంతా ఉంటుంది. తన పాత్ర మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
‘చాలామంచి ప్యాసినేట్‌ మూవీ టీమ్‌తో పనిచేశాను. డైరక్టర్‌ కౌశిక్‌ కల్ట్‌ ఫిల్మ్‌ మేకర్‌ అవుతాడు. ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని హీరోయిన్‌ అపూర్వ రావు చెప్పారు. హీరో యశ్‌ మాట్లాడుతూ, ‘ఇది నాకు మూడో సినిమా. ‘హ్యాపీ ఎండింగ్‌’ అనేది కమింగ్‌ ఆఫ్‌ ఏజ్‌ ఫిల్మ్‌. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథ. షూటింగ్‌ పూర్తి చేసుకుని, త్వరలోనే సెన్సార్‌కు వెళ్ళబోతున్నాం’ అని అన్నారు.

Spread the love