చండూర్ మున్సిపల్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు 

నవతెలంగాణ- చండూరు  

హోలీ పండుగ సందర్భంగా చండూరు మున్సిపల్  ప్రజలకు   చండూరు మున్సిపల్ చైర్ పర్సన్  తోకల చంద్రకళ వెంకన్న శుభాకాంక్షలు  తెలిపారు.  ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలన్నారు. ప్రజలు అందరి జీవితాలు సప్తవర్ణాలతో నిండి శోభిల్లాలని ఆకాంక్షించారు. ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా  ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love