Sunday, June 28, 2026
E-PAPER
Homeదర్వాజహ్యష్ ట్యాగ్.. నౌ ఫర్ క్లైమేట్..!

హ్యష్ ట్యాగ్.. నౌ ఫర్ క్లైమేట్..!

- Advertisement -

ఆకాశం మానవ అస్తిత్వ ఆందోళనరాగమై
నవ వసంత గీతాన్ని విరచిస్తుంటే
రవి గుండె ఆవేదనతో మండుతోంది..!
పుడమి వెన్నెల జలపాతం
మండుటెండల మరణ శాసనమయ్యింది
ఎల్ ని నో హెచ్చరిక కదనతరంగాలు
నేటి సుప్రభాత కాలుష్య భూతాల కారణాలు
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈ-వ్యర్థాలు
కర్మర్భన ఉద్గారాల గమన సమీకరణాలు
ఓజోన్ పొర చిల్లుల గాయాలు
అన్నింటిలో ప్లాస్టిక్ సంద్రాల కెరటాలు
పంచభూతాలన్నీ ప్రాణ సంకటాలు
ఇవే నేటి విజ్ఞాన నిర్లక్ష్య సంకేత సమరాలు
భవిష్యత్ తరాల మనుగడకే
పెను సవాళ్ల గ్రహణాలు
బాధ్యతా ఆక్సిజన్ విత్తనాలు
మన గుండె భూమిలో బలంగా నాటుకుంటే …
అందమైన హరిత వర్ణ శోభితమయ
అడవుల క’వన’రాగాలు
బతుకు పువ్వుల నవ్వుల సుగంధ పరిమళాలు
ప్రకృతి తనువంత స్వచ్ఛతై ప్రతిబింబిస్తుంటే
పర్యావరణమే జీవన వేద పాఠ్యాంశం
ప్రకృతి చిరు సవ్వడుల సందేశమే
జీవవైవిధ్య ఏకత్వ సంగీతం
చెట్ల ఆకులు పాడే పాటలతోటలే
ప్రగతి రథ నాగరిక సంకల్పం
మన అడుగుల ఆచరణ అక్షరాలన్నీ
నవ మొక్కల సృష్టి కావ్యాలై కదిలొస్తుంటే…
అవని హృదయ భాషంతా కాలుష్య రహిత
ప్రకాశ కిరణాల కవిత్వ మయం..!
ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -