దారుణం.. భార్య‌ను క‌త్తితో హ‌త‌మార్చి..

son-died-after-eating-rat-poison-because-his-father-reprimanded-himనవతెలంగాణ- సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిప‌ల్లి వీక‌ర్ సెక్ష‌న్స్ కాల‌నీలో దారుణం జ‌రిగింది. ఓ భార్త త‌న భార్య‌ను మొద‌ట‌గా క‌త్తితో పొడిచి చంపాడు. అనంత‌రం తాను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృతుల‌ను యాద‌గిరి, య‌శోద‌గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Spread the love