ప్రజల వెన్నంటే ఉంటా.. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా..

– ఈ ఎన్నికలు బిఅర్ఎస్ కు చివరివి..
– మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

– అరు గ్యారంటీ కార్డులపై మొదటి సంతకం..
– ఇచ్చిన హామీ లకు కట్టుబడి ఉంటాం..

– 500 వందలకు గ్యాస్, 2లక్షల రూణమఫీ..
-కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్  భూపతి రెడ్డి..
నవతెలంగాణ-డిచ్ పల్లి : ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు బిఅర్ఎస్ ప్రభుత్వానికి చివరి ఎన్నికలని,ఈ సారి ప్రజల అగ్రహానికి గూరి కాక తప్పదని,
బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలకు మాయ మాటలు చెప్పి లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారి మాటలను నమ్మవద్దని, నీరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిందని, కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగలు పొందారని, వారికే అదిక లబ్ధి పొందిందని,ఈ ఎన్నికల్లో సైతం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు బిఅర్ఎస్ నాయకులు చేస్తున్నారని,కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ కార్డుల పథకం పైన మొదటి సంతకం ఉంటుందని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం డిచ్ పల్లి మండలం లోని ముల్లంగి, ఘన్పూర్,డిచ్ పల్లి స్టేషన్ అమృతపూర్,ఇస్లాంపూర్,గొల్లపల్లి,నడిపల్లి, ఖిల్లా డిచ్ పల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు.ఈ ప్రచారం లో బాగంగా పలు చోట్ల డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని, అర్హులైన వారికి ఇవ్వకుండా పేదలకు, నిరుపేద దళితులకు, నీరుద్యోగులకు, రైతులకు, యువకులకు మోసం చేశారని మరోసారి నమ్మించి నట్టేట్ట ముంచడానికి మన ముందు వస్తున్నాడని ప్రజలు అన్ని గమనిస్తున్నారనిపేర్కొన్నారు.2001నుండి డాక్టర్ భూపతి రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పై చేసేది డాక్టర్ వృత్తి వదిలి గ్రామ గ్రామన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకత పై ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు చైతన్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశానని ఈ విషయం ప్రజలకు బాగా తెలుసని గుర్తు చేశారు. ఈసారి వచ్చేది  కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజల బతుకులు మారనున్నయని,కులం మతం ప్రాంతం భేదం లేకుండా ప్రజలు అందరించి చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.2018 ఎన్నికల సమయంలో కూడా ప్రజలకు కుల సంఘాలను బుట్టలో వేసుకోవడానికి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రతి గ్రామానికి ప్రోసెడింగ్ కాపీలు అందజేశారని, ఇచ్చిన ఆ కాపీలకు నీదులు మంజూరు కాక పనులు ఎక్కడ జరగలేదన్నారు. మరోసారి కుల సంఘాల పేరున ప్రొసీడింగ్ పత్రాలు,ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎవరిని మోసం చేయడానికి ఈ పత్రాలు, సమ్మేళనలని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన పలువురు ఎమ్మెల్యేలకు దళిత బందులో 30% శాతం కమిషన్ తీసుకుంటున్నారని పేర్కొన్నాట్టుగానే ప్రతి చోటా అదేజరుగుతుందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా చేసిన ఘనత బిఆర్ఎస్కే దక్కుతుందని వివరించారు.అదికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చిన, పదేళ్లుగా హామీ లను అమలు చేయలేదని, రైతు రుణా మాఫీ ఇతర హామీ లు అమలు కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్, రైతులకు సైతం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా ఎనిమిది గంటలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముందస్తుగా ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలను ఆరు నూరైనా అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో లోని ప్రతి పథకాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను అందుకుంటమన్నారు. రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల వస్తువులను అందజేస్తామని పెళ్లి చేసిన వారికి లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం అందజేయడం జరుగుతుందన్నారు.
లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నేటి వరకు అమలు కాలేదని, ఏదో నామే వాస్తే సగం మందికి రుణమాఫీ వచ్చిందని దీనిపై ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. అ నేపం కాంగ్రెస్ పార్టీ పై నెపుతున్నరని ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసి చూపెడతామన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తోందని,  ప్రజలు తమంతట తామే స్వచ్చందంగా వేలాదిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. రైతన్నలకు రెండులక్షల రుణమాఫీ చేసి చూపుతామని, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులకు పెన్షన్ 4 వేలు అందజేస్తామని, వీటిలో ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, వరి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర,వరి కి ఇతర పంటలకు బోనస్ 5వందలు అందజేస్తామని,రైతులు తోందర పొడి వరి నుంచి తక్కువ ధరకు అమ్ముకోళద్దని సూచించారు. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లో ప్రకటించిన వాటన్నింటినీ అమలు చేసి తీరుతా మన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో సహాయం, రెండు లక్షల ఉద్యోగాలు అందజేస్తామని, ఆరోగ్య శ్రీ పథకంలో 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామన్నారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు అయా గ్రామాల్లో బోనాలు,డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేశ్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ విద్యా సాగర్ రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్,డిచ్ పల్లి మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, సినియర్ నాయకులు మాజీ ఎంపీపీ కంచేట్టి గంగాధర్, నర్సారెడ్డి, డాక్టర్ శాదుల్లా, మాజీ సర్పంచ్ బుస సుదర్శన్,ఎజి దాస్, బిళ్ళ రమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్యాం సీన్,  నాయకులు, లింగం, డిసిసిబి డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, ముళ్ళంగి ఎంపిటిసి నర్సయ్య,కార్యకర్తలు, మహిళలు , యువకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్.
ఖిల్లా డిచ్ పల్లి మాజీ సర్పంచ్ ఎజి దాస్,అయా పార్టీలకు చెందిన యువకులు వందల సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.పార్టీ కండువా వేసి సాధారణంగా అహ్వానించారు.

Spread the love