- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలటం, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
- Advertisement -



