నవతెలంగాణ – భీంగల్ రూరల్ : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబా పూర్ గ్రామంలో ఎల్లోల అనూష భర్త సురేష్ వీరి రెండవ కుమారుడు రితిక్ 2021 లో పుట్టిన దినము నుంచి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో హాస్పిటల్లో చూయించినప్పుడు షుగర్ ఉందని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంతో అనేక హాస్పిటల్లో తిరిగినప్పటికీ బాబు పరిస్థితి క్షీణించుకోవడం జరిగింది. షుగర్ వ్యాధితో పాటు లివర్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని డాక్టర్లు నిర్ధారించడం అయినది కుటుంబీకులు నెల రోజులు పాటు నిజామాబాదు హైదరాబాదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.హాస్పిటల్లో చూపించినప్పటికీ బాలుడు పరిస్థితి బాగుపడకపోవడంతో ఆర్థికంగా కుటుంబం చితికి పోతుందని బాధపడుతున్నారు. చికిత్స జరుగుతున్న సమయంలో హార్ట్ ఎటాక్ రావడం జరిగిందని. ఆటపాటలు ఆడుకునే వయసులో అనారోగ్య పాలైన రిత్విక్ ను ఆదుకోవాలని తల్లి అనూష వీడుకోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితులుు రెక్క ఆడితేనే గాని కడుపుు నిండే పరిస్థితిి అంటూూ, ఇబ్బంది కారణమును బట్టి ఉంటున్న ఇల్లును అమ్మి వేయడం జరిగింది ఎవరు ఆదుకునే పరిస్థితిలో లేకపోవడంతో భీంగల్ బాబాపూర్ గ్రామాల్లో ఉన్న ప్రజలు యువకులు యూత్ పిల్లలు ప్రతి ఒక్కరూ 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు జమ చేస్తూ చందారూపకముగా వారికి ఇవ్వడం అయినది హాస్పిటల్లో అడ్మిట్ అయిన రిత్విక్ ను డిశ్చార్జ్ కొరకు డబ్బులు ఉపయోగపడ్డాయని కూలి నాలి చేసుకుంటున్న కుటుంబంలో భర్త గల్ఫ్ దేశానికి వెళ్లి మోసపోవడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజుకు రిత్విక్ ఇంజక్షన్ మందు గోళీలు వేసుకోవడానికి అయ్యే ఖర్చు 4నుంచి 5 వెయ్యిలు ఖర్చవుతుంది ఆరోగ్యశ్రీ చేయిద్దామనుకున్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వం అధికారులు మా మీద దయచూపి మా బాబుకు పెన్షన్ రూపకముగా సహాయం అందించాలని తల్లి అనుషా కోరడం జరిగింది కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.