
నవతెలంగాణ-గోవిందరావుపేట
వరదల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు ప్రాంతాలలో వర్షాల వల్ల దెబ్బతిన్న ఇండ్లను పట్టపొలాలను ఇసుకమేటలను పరిశీలించి రైతులను పరామర్శించి ఓదార్చారు.వర్షంలో కూలిన ఇండ్లు, వ్యవసాయ రైతులకు పంట నష్టం, ఒక్కొక్క రైతు చేనులో ఇసుకమేటలను పెట్టి నందున, ప్రభుత్వం సహాయంగా పొలాలను చదును చేయుటకు అవసరమయ్యే ఖర్చు మొత్తం భరించాలని. ఇల్లు కొట్టుకపోయి నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్ రూములు సాంక్షన్ చేయాలని, ఇల్లు లకు నీళ్లు వచ్చి బియ్యం ఉప్పు పప్పు సర్వం నానిపోయి నష్టపోయిన కుటుంబాలందరికి, తగిన సహాయం ప్రభుత్వం చేయాలని, మద్దినేని తేజ రాజు మరియు వాళ్ళ తమ్ముని యొక్క గొర్రెలు మొత్తం కలిపి సుమారు 150 గొర్రెలు అకాల వర్షంతో కొట్టుకపోవడం జరిగింది అని, వారి కుటుంబానికి ప్రభుత్వం, సహాయ అందించాలని మరియు భిక్యా కుటుంబం వర్షంలో సర్వం కోల్పోయి కట్టు బట్టలతో ఉన్నారని, వారి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. మరియు అదే విధంగా జాతీయ రహదారి నం 163లో పల్లలు ఉండే దగ్గర మోరీలకు బదులుగా బ్రిడ్జిలు వేసి నీళ్లు సులభతరంగా పోయే విధంగా చర్య తీసుకోవాలని, కోరారు. పసర పోలీస్ స్టేషన్ వెంబటి నీరు పోయె ద్వారం ఒక్కటి ఉండడం వల్ల నీరు సరిగా పొక ఇళ్లల్లోకి నీరు రావడం జరిగిందని ఇంకో ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లయితే నీళ్లు, తేలికగా పోయి, ఇంత నష్టం జరిగేది కాదన్నారు. కావున ఇప్పటికైనా ఎన్ చ్ 163 అధికారులు ఆలోచించి రెండో ద్వారాన్ని ఏర్పాటు చేయాలనిఅన్నారు. ఆ విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో కూడా నీళ్లు సులభతరంగా పోయి నష్ట నివారణ ఉండదని అన్నారు. దెబ్బతిన్న 163వ జాతీయ రహదారిని తక్షణం మరమ్మతులను చేయాలన్నారు. పసర చుట్టుపక్కల ఊర్లకు విద్యుత్ సౌకర్యాన్ని తక్షణ పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరపనేని వెంకట సురేష్ ఏనుగు రవీందర్ రెడ్డి, నగరపు రమేష్ కర్ర సాంబశివారెడ్డి ,బీజేవైఎం అధ్యక్షులు కొత్త సురేందర్, ఇమ్మడి రాకేష్ యాదవ్, రుద్రారపు సురేష్ ,ఎద్దునూరి రమేష్, మెరుగు సత్యనారాయణ, కొత్త సుధాకర్ రెడ్డి, బైరు మహిపాల్ రెడ్డి, బాణాల రాజు, రాకేష్ రెడ్డి, బొమ్మరబోయిన వీర బిక్షం, మూల రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.