– సొంత నిధులతో గొడుగులు అందజేత
– వేణుగోపాలస్వామి చైర్మన్ పోన్న రమేష్
నవతెలంగాణ-గండిపేట్
ఇటీవల కురుస్తున్న వర్షాలకు నిత్యం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు అండగా ఉంటామని వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ కొన్నా రమేష్ అన్నారు. మంగళవారం నార్సింగి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం నిత్యం వర్షంలో తడుస్తూ ఉన్నా పోలీసులకు అండగా ఉంటూ మంచి మనసుతో తమ సహకారం చేసినట్టు తెలిపారు. వర్షంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల ఇబ్బందులను గుర్తించి సాయం చేసినట్టు తెలిపారు. సీఐకి మొక్కతో జ్ఞాపకాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ శ్యాంసుందర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.