ఈ నిరుపేదరాలుని ఆదుకోండి..

– శాశ్వత పరిష్కారం చూపండి..

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల ఆవరణలో గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న షహీన్, అక్కడి నుంచి ఇంటిని తొలగించాలని ఈ కళాశాలకు దిష్టిబొమ్మగా తయారైందని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు సందర్శించిన ఆమెకు ఏలాంటి న్యాయం జరగడం లేదని నిరుపేదరాలు వాపోతోంది. గత 25 సంవత్సరాల కిందట పవర్ ప్లాంట్ కు ఎదురుగా చిన్న గుడిసె వేసుకొని హోటల్ నడిపిస్తూ ఉండగా, రెంజల్ గ్రామపంచాయతీ అధికారులు ఆమె వద్ద గత 25 సంవత్సరాలుగా టాక్స్ వసూలు చేశారు. ప్రస్తుతం అక్కడ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో ఈ నిరుపేద రాలుకు సొంత ఇల్లు లేక అక్కడే నివాసం ఉంటున్నారు. పలుమార్లు ఈ కళాశాలన్ని సందర్శించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు ఆమెకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇంటి స్థలం, నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన ఎవరు పట్టించుకోకపోవడంతో ఆమె మనస్థాపానికి గురవుతోంది. ప్రభుత్వ భూమి కావడంతో పంచాయతీ అధికారులు పన్నులను వసూలు చేస్తుండడంతో ఆమెను అక్కడ నుంచి తొలగించడానికి ఎవరికి ఆస్కారం లేకుండా పోయింది. మండలంలో ఎక్కడైనా తనకు తలదాచుకోవడానికి ముందుకు రావాలని ఆమె కోరుతోంది. గత పది సంవత్సరాల కిందట భర్త మృతి చెందడంతో తన పిల్లలతో ఆమె అక్కడే ఉంటూ కూలి పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటుంది. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఆమెకు శాశ్వత పరిష్కారం చేయాలని ఆమె ఎదురుచూస్తోంది.
Spread the love