హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

నవతెలంగాణ – ఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. హేమంత్ సొరేన్ తరఫున సుప్రీంకోర్టు విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. సోరెన్ అరెస్టయిన సంగతి చెప్పారు. బుధవారం రాత్రి హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సొరెన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. రాష్ట్ర హైకోర్టులు రాజ్యాంగ బద్ధమైన న్యాయస్థానాలని, ప్రతి ఒక్కరికీ తలుపులు తెరిచి ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది .

Spread the love