జీవో 142 అభ్యంతరాలపై ఉన్నతస్థాయి కమిటి

Jio 142 on objections High level committee– టీపీహెచ్‌ డీఏ 
నవతెంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజారోగ్య విభాగంలో రీఆర్గనైజేషన్‌ జీవో 142పై ఉన్న అభ్యంతరాలపైన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు ఆదేశించినట్టు తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీపీహెచ్‌డీఏ) తెలిపింది. మంత్రి హరీశ్‌ రావుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం టీపీహెచ్‌డీఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ కత్తి జనార్థన్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూర్ణచందర్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

Spread the love