– మంత్రి హరీశ్‌రావుకు పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావును బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 14 నెలలుగా ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లు, మెడికల్ బిల్లులు, సెలవు వేతనాలు, జెడ్పీ జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ బిల్లులు, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వంటివి బిల్లులను సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల్లో తక్షణమే జమ చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ అతి తొందరలోనే అన్ని పెండింగ్ బిల్లులనూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఖాతాల్లోకి జమ చేస్తామంటూ స్పష్టమైన హామీనిచ్చారని తెలిపారు. అదే విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ప్రవేశ పెట్టబోయే నూతన హెల్త్ స్కీమ్ మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు చేరిందన్నారని పేర్కొన్నారు. అతి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో నూతన హెల్త్ స్కీమ్ ఉత్తర్వులు విడుదల చేస్తామంటూ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారని తెలిపారు.