– మంత్రి హరీశ్‌రావు హౌమియో వైద్యవిద్యార్థుల పోస్ట్ కార్డులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమకు ఉపకారవేతనాలు పెంచాలని కోరుతూ హైదరాబాద్ రామాంతపూర్‌లోని హౌమియో కళాశాల పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు డిమాండ్ చేశారు. గత 22 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న వారు బుధవారం మంత్రి హరీశ్ రావుకు పోస్టు కార్డులపై తమ డిమాండ్‌లను రాసి పోస్ట్ చేశారు.
ప్రతి రెండేండ్లకు ఒకసారి ఉపకారవేతనాలను పెంచాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెంచలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.