హై పర్ఫార్మింగ్‌ కంప్యూటింగ్‌

– సౌకర్యాలు పెంచాలి :కిరణ్‌ చంద్ర
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
దేశంలో హై పర్ఫార్మింగ్‌ కంప్యూ టింగ్‌ క్లస్టర్లను ప్రోత్సహించాలని స్వేచ్ఛ (దేశంలో ఫ్రీ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యమ సంస్థ) ప్రధాన కార్యదర్శి కిరణ్‌ చంద్ర డిమాండ్‌ చేశారు. శనివారం స్వేచ్ఛ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని టెక్‌ మహీంద్రా ప్రాంగణంలో కృత్రిమ మేధస్సు – మిషన్‌ లెర్నింగ్‌ (ఏఐ, ఎంఎల్‌)-2023, భవిష్యత్తు అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌ చంద్ర సెకెండ్‌ మిషన్‌ ఏజ్‌-ఏఐ, డిజిటల్‌ ఎకో సిస్టం అనే అంశంపై కీలకోపన్యాసం ఇచ్చారు. ఆటో మేషన్‌, ఏఐ, సమాజంలో ఏఐ పాత్రను వివరించారు. నేటి సమా జానికి ఏఐ, ఎంఎల్‌ కీలకమని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లో పదేండ్ల అనుభవ మున్న జానకిరాం మాట్లాడుతూ లాంగ్వేజ్‌ మోడల్స్‌ ను వివరించారు. ఈ కార్యక్రమంలో గూగుల్‌ వెబ్‌ ఎంఎల్‌ లీడ్‌ జేసన్‌ మయేస్‌, స్వేచ్ఛ డెవలపర్‌ చాప్టర్‌ కన్వీనర్‌ రంజిత్‌ రాజ్‌ వాసం తదితరులు పాల్గొన్నారు.

Spread the love