ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు

– గోసాన్ పల్లిలో పామాయిల్ పై రైతులకు అవగాహన
– ఉద్యాన శాఖ అధికారి ఆర్. బాలాజీ
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫామాయిల్ సాగుపై రైతులంతా దృష్టి సారించాలని దుబ్బాక మండల ఉద్యాన శాఖ అధికారి ఆర్. బాలాజీ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గోసాన్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్. బాలాజీ మాట్లాడుతూ పామాయిల్ సాగుకు ప్రభుత్వం అందించే సబ్సిడీ రాయితీలు, ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనంతరం పలువురు గ్రామ రైతుల సందేహాలు అడగగా… ఫామాయిల్ సాగులో తక్కువ నష్టాలతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దొందడి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్,ఏఈఓ అస్మా,బిఆర్ఎస్ నాయకుడు దొందడి తిరుపతిరెడ్డి, గ్రామ రైతులు ఉన్నారు.

Spread the love