26 ఏండ్ల త‌ర్వాత‌ శ్రీన‌గ‌ర్‌లో అత్య‌ధికంగా పోలింగ్ న‌మోదు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : శ్రీన‌గ‌ర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా పోలింగ్ శాతం న‌మోదైంది. నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 36.58 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ స్థాయిలో పోలింగ్ న‌మోదు కావ‌డం 1998 త‌ర్వాత ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.  శ్రీన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానానికి 24 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 12 మంది పోటీ చేశారు. చదూరా, చాహ్ ఐ ష‌రీఫ్‌, గంద‌ర్బ‌ల్, కంగ‌న్, ఖాన్‌సాహిబ్, సోఫియాన్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 45 శాతం కంటే ఎక్కువ పోలింగ్ న‌మోదైంది. బుద్గాం, గంద‌ర్బ‌ల్, పుల్వామా, సోఫియాన్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. చివ‌రిసారి 1996లో 40.94 శాతం పోలింగ్ న‌మోదు కాగా, మ‌ళ్లీ ఇప్పుడు 36.58 శాతం పోలింగ్ న‌మోదైంది.

Spread the love