భార్యను ప్రేమించడం ఎలా?

భార్యను ప్రేమించడం ఎలా?హీరో విజయ్ ఆంటోని నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘లవ్‌ గురు’. మణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజరు ఆంటోనీ నిర్మించారు. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ఈ సినిమాను రంజాన్‌ పండుగ సందర్భంగా ఏప్రిల్‌ 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.తండ్రి పోరు పడలేక పెళ్లికి ఓకే చెప్తుంది ప్రియా అనే అమ్మాయి. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. పెళ్లి చూపుల టైమ్‌లో కాబోయో భర్తకు కొన్ని కండీషన్స్‌ పెడుతుంది. అమ్మాయిని ఇష్టపడిన ఆ అబ్బాయి ఆమె చెప్పిన కండీషన్స్‌ అన్నింటికీ తలూపుతాడు. భార్యను వన్‌ సైడ్‌గా లవ్‌ చేస్తాడు. షరతులన్నీ ఒప్పుకుంటాడు గానీ పెళ్లయ్యాక వాటిలో ఉన్న ఇబ్బందులు అర్థమవుతుంటాయి. పెళ్లయ్యాక ఎదురైన ఈ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు?, భార్యను ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాడా లేదా అనే అంశాలతో ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు.

Spread the love