ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి భారీ వరద నీరు

నవతెలంగాణ -రంగారెడ్డి
రాజేంద్రనగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల్లోకి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రెండు రోజులుగా జలాశయాల్లోకి వరద ప్రారంభమైంది. ఈ సందర్భంగా హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి 400 క్యూసెక్కుల వరద వస్తుండడంతో, చెరువు నీటిమట్టం స్థాయి 1764 feets కాగా 1762 ఫీట్స్ అడుగులు నీరు చేరింది. మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ, ఏసీపీ గంగాధర్, జలమండలి జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మేయర్ మహేందర్ గౌడ్ సిబ్బందితో కలిసి జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ తగ్గిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Spread the love