లైసెన్స్‌ మేళాకు భారీ స్పందన

నవతెలంగాణ – మెదక్
మెదక్‌ నియోజకవర్గానికి చెందిన యువతీ, యవకులు ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాకు విశేష స్పందన వచ్చింది. ఈ మేళాను మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, పునీత్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని యువకులు భారీగా తరలిరావడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం యువతతో కిటకిటలాడింది. మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు క్యూలైన్లు ఏర్పాటుచేశారు. తొలిరోజు మొత్తం 1633 మంది యువకులు టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులకు స్లాటు బుక్‌ చేసి ఆర్టీవో కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరమని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువకులకు లైసెన్స్‌ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Spread the love