ఎక్సైజ్‌ శాఖలో భారీగా బదిలీలు

Huge transfers in excise department– 14 మంది ఈఎస్‌లకు స్థానచలనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లను (ఈఎస్‌) ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇద్దరు ఉప కమిషనర్లు, తొమ్మిది మంది సహాయ కమిషనర్లకు స్థాన చలనం కల్పించారు. మల్టిజోన్‌-1óలో 64 మంది, మల్టి జోన్‌-2 లో 85 మంది సీఐలను బదిలీ చేశారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు, ఒకే రెవెన్యూ జిల్లాలో మూడేండ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఈసీ మార్గ దర్శకాలకు అనుగుణంగా బదిలీ చేసినట్టు పేర్కొన్నారు.

Spread the love