– ప్రకృతిని అర్థం చేసుకున్న వ్యక్తి : నలుగురికి విజ్ఞానాన్ని అందించేందుకు కృషి
– జేవీవీకి ఆయనో గుండెకాయ
– ఆ వేదిక కాగడా పట్టుకుని పనిచేశారు : ప్రొఫెసర్ ఆదినారాయణ సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జనవిజ్ఞాన వేదిక నాయకులు ప్రొఫెసర్ ఆదినారాయణ మానవత్వమే ఇజంగా చివరికంటూ బతికారని పలువురు వక్తలు కొనియా డారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదినారాయణ సంస్మరణ సభను జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహిం చారు. సభలో ఆయన కుమారుడు అశోక్, వారి కుటుంబ సభ్యులు, జేవీవీ గౌరవా ధ్యక్షులు డాక్టర్ దాసరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీనాధ్, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తిర్మల్‌రావు, వరంగల్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ జయప్రకాశ్, శాస్త్రవేత్త రాధ, జేవీవీ రాష్ట్ర నాయకులు బీఎన్‌రెడ్డి, వరప్రసాద్, రాజా, జితేంద్ర, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు చరద్రశేఖర్‌రావు, ఎస్పీ లింగస్వామి తదితరులు సభలో పాల్గొన్నారు.
ఆదినారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆశయాలను కొనసాగి స్తామంటూ ప్రతినబూనారు. అనంతరం కోయ వెంకటే శ్వరరావు మాట్లాడుతూ ఆయనో సముద్రంలాంటి వాడైతే..మనం ఒక నీటిబొ ట్టులాంటోళ్లమేనని ఆయనతో తనకున్న అనుబం ధాన్ని గుర్తు చేసుకున్నారు.
అనంతమైన వ్యక్తిత్వం ఆయన సొంత మన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఆధునిక ఆలోచనల విస్తరణకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయనకు ఏ ఇజమూ లేదనీ, హ్యూ మనిజమే శ్వాసగా జీవించారని స్మరించుకున్నారు. ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకున్నారన్నారు. జీవ పరిణామాన్ని, రసాయనక చర్యల పర్యవసనాన్ని తెలుసుకోవటమే కాక, శాస్త్రీయత విశిష్టతను విస్తృత పరిచారన్నారు. సమాజంలో సరైన ఆలోచనా విధానాన్ని పెంపొందించే లక్ష్యంతో వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటంలో ఆయన ముందు వరసలో ఉన్నారని తెలిపారు.
ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదికకు ప్రొఫెసర్ ఆదినారాయణ మోడల్ అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. ‘మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చానో లేదో తెల్వదు కానీ..ఆదినారాయణ చనిపోయినప్పుడు కన్నీల్లు తన్నుకొచ్చాయని’ గుర్తు చేసుకున్నారు.సైన్సు ద్వారా వాస్తవాలు ప్రజలకు చేరవేసేందుకు ఆయన చేసి కృషి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. జేవీవీ కాగడా పట్టుకుని పనిచేశారని చెప్పారు. ఆదినారాయణ జీవితం వ్యక్తిగతమైంది కాదనీ, సంస్థాగతమైందని వివరించారు.నిమ్స్ మాజీ డైరెక్టర్ దాసరి ప్రసాదరావు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఒక ప్రజా శాస్త్రవేత్తను కోల్పోయిందని చెప్పారు. సైన్సు ఫలాలు అట్టడుగు వర్గాలకు, పేద పిల్లలకు అందాలని జీవితాంతం పనిచేశారన్నారు. ఆయన నిగర్వీ, ఆజాతశత్రువుని కొనియాడారు. శ్రీనాధ్ మాట్లాడుతూ మూడు తరాలకు పైగా క్లిష్టతర మనుకునే రసాయన శాస్త్రాన్ని యూనివర్సిటీలో బోధించిన ప్రొఫెసర్ ఆదినారాయణ లేడనే విషయాన్ని జీర్ణించు కోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కొనసాగించటమే ఆయనకిచ్చే నివాళి ని చెప్పారు.