నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది : అజిత్ పవార్

నవతెలంగాణ హైదరాబాద్: ‘నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాం. రాష్ట్రానికి ఓ బలమైన నేత కావాలి. అందుకు శరద్‌ పవారే మాకు స్ఫూర్తి. శరద్‌ పవారే మా నాయకుడు, మా గురువు. ఆయనే మా దేవుడు కూడా. అందులో ఎలాంటి అనుమానానికి తావు లేదు. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ కావాలి. బీజేపీలో నేతలు 75ఏండ్లకే పదవీవిరమణ తీసుకుంటారు (83 ఏండ్ల శరద్‌ పవార్‌ను ఉద్దేశిస్తూ). కానీ, ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న రాజకీయాలన్నింటినీ మీరు చూస్తూనే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల కోసం పనిచేయాలని అనుకుంటున్నాం. 2004లో కాంగ్రెస్‌ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయ్‌. ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఎన్సీపీకి వచ్చినప్పటికీ వదిలేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం కొన్ని ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి` అని అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. అంతకుముందు ఎన్సీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. మేం చేస్తున్న పనికి మమ్మల్ని ఆశీర్వదించండి అని శరద్‌ పవార్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

 

Spread the love