Thursday, May 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐడీఏలను వెంటనే చెల్లించాలి

ఐడీఏలను వెంటనే చెల్లించాలి

- Advertisement -


నిజామాబాద్‌లో సంచార్ భవన్ వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ధర్నా
​సంఘీభావం తెలిపిన సీఐటీయూ
నవతెలంగాణ-కంఠేశ్వర్

ఐడీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఎస్‌ఎ‌న్‌ఎల్ ఎంప్లాయిస్ ‌యూనియన్ ఉద్యోగులు, ఎన్‌ఎఫ్‌టీఈ ఉద్యోగులు, ఎ‌స్‌ఎ‌న్‌‌ఈఏ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో సంచార్ భవన్ వద్ద బుధవారం ధర్నా చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‌బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐడీఏను వెంటనే ఇవ్వాలని, అలాగే జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐడీఏలను వెంటనే చెల్లించాలని, బీఎస్‌ఎ‌న్‌ఎల్‌లో అఫెర్టబిలిటీ కండిషన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌బాబు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కే.రామ్మోహన్‌రావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ‌యూనియన్స్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్‌ఎ‌న్‌ఎల్ జిల్లా కన్వీనర్ ఈవీఎల్ నారాయణ, ‌నాయకులు డి.సాయిలు, సాయన్న, చంద్రశేఖర్, రాజేందర్, సందీప్ రాటి, ఎంఎన్‌వీ అనురాధ, లత, సుభాష్, రిటైర్డ్ ఉద్యోగులు మధుసూదన్, బాల దుర్గయ్య, గంగాధర్, పాండురంగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -