రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : సీపీ రంగనాథ్‌

నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్‌
ప్రభుత్వ నిబంధనలకు లోబడి వరి ధాన్యంలో తరుగు తీయాల్సి ఉంటుందని, అంతకు మించి ఎక్కు వ మొత్తంలో తరుగును తీస్తే తక్షణమే స్థానిక పోలీ స్‌ అధికారులతో పాటు, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ,టాస్క్‌ ఫోర్స్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపిలకు సమాచారం అందించాలని పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ రై తులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పో లీస్‌ కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పా టు, కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులతో ధాన్యం కొ నుగోలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభు త్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక మొత్తంలో తరు గు పేరుతో రైస్‌ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నట్లు గా రైతులు, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌పూల్‌సింగ్‌,ఏసీపీ రఘు చందర్‌, టాస్క్‌ ఫోర్స్‌, స్పెషల్‌ బ్రంచ్‌ ఏసీపీ జితేంద ర్‌ రెడ్డి, తిరుమల్‌, సీఐ రాఘవేందర్‌, డీటీ రవీందర్‌, ఏపీఎం కవిత, తదితరులు పాల్గొన్నారు.
జనగాం : ఆరుకాలం కష్టపడి ధాన్యం పండిం చిన రైతులను రైస్‌ మిల్లర్లు మోసం చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవి.రంగనాథ్‌ అన్నారు.శనివారం జనగా మ జిల్లా పరిధిలోని శ్రీదేవి రైస్‌ మిల్లును వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ అధికారులతో తని ఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు మిల్లు వచ్చిన ధాన్యం, వచ్చిన ధాన్యంలో తరుగు వివరాలతో పాటు ధాన్యం తూకం నిర్వహిస్తున్న తీరును పోలీస్‌ కమిష నర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రైతులను మోసం చేయకుండా రై స్‌ మిల్లర్లు నిబంధన ప్రకారం వ్యవహరించాలని సూ చించారు. ఈ పరిశీలనలో టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాం చ్‌ ఏసీపీలు జితేందర్‌రెడ్డి, తిరుమల్‌ పాల్గొన్నారు.
నర్మెట్ట : ఐకెపి కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో అధిక తరగతి ఇస్తే సమాచారం ఇవ్వండి న ర్మెట్ట ఎస్సై అనిల్‌ కుమార్‌ అన్నారు. శనివారం నర్మెట్ట మండలంలోని మచ్చుపహాడ్‌, బొమ్మకుర్‌, హనుమం తపూర్‌, వెల్దండ, మలకపేట, గండిరామారం అమ్మా పూర్‌ గ్రామాలలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు సంద ర్శించి అక్కడ ఫ్లెక్సీలు కట్టి రైతులకు, కొనుగోలు దా రులకు సూచనలు చేయడం జరిగింది.
లింగాలఘనపురం : మండలంలోని వనపర్తి, పటేల్‌ గూడెం గ్రామాలలోని ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎస్‌ఐ ప్రవీణ్‌ శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని సంబంధి త అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా స మస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. మం డలంలోని నెల్లుట్ల గ్రామంలో మణికంఠ రైస్‌మిల్‌ సందర్శించి బిల్లు బుక్కులు చెక్‌ చేసి రైతులకు అన్యా యం జరగకుండా వారు పంపించిన వడ్లను, తరుగు తీయకుండా కొనవాల్సిందిగా ఆదేశించారు. తరుగు తీసి రైతులను మోసం చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

Spread the love