ఉద్యమకారుడికి గ్యాస్‌ స్టవ్‌, సిలిండర్‌ అందజేత

నవతెలంగాణ-ములుగు
ఇటీవల కుటుంబ సమేతంగా సమ్మక్క సారక్క దేవతలకు పూజలు చెల్లించడానికి మేడారం విచ్చేసిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది సంకెనపల్లి రాము కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాడ్వాయి మండల అధ్యక్షులు ఆలం శ్రీను స్వాగతం పలికారు. ఆరాధ్య దేవ తలకు పూజా కార్యక్రమాలు, మొక్కులు చెల్లించారు. అనంతరం మండల అధ్యక్షుడు ఆలం శ్రీను ఇంటిని సందర్శించారు. సామాజిక ఉద్యమకారుడు, ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న యువ నాయకుడు ఆలం శ్రీను ఇంట్లో కనీసం గ్యాస్‌ సిలిండర్‌ పొయ్యి లేకపోవడాన్ని చూసి వెంటనే జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ మొగుళ్ళ భద్రయ్యకు సమ స్యను వివరించి వెంటనే వారి ఆదేశాలతో గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యి ఇవ్వడానికి నిర్ణయించుకు న్నారు. ఈ మేరకు తాడ్వాయి మండల కేంద్రంలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మనో హర్‌ ద్వారా శనివారం గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యిని కొనుగోలు చేసి ఆలం శ్రీనుకు అందజేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులను తన కుటుంబ సభ్యులుగా భావించి మానవత్వంతో స్పందించి మండల అధ్యక్షుడి పేదరికాన్ని చూసి ఉదార సహాయం చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు రాముకు ములుగు జిల్లా కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్‌ నాయక్‌, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌, రాష్ట్ర నాయకులు ఎలకంటి రాజు, పోలోజు రామూర్తి, పిల్లల రాణి, చల్లూరి మహేందర్‌ జిల్లా నాయ కులు ఏడుకొండలు, పర్వతాల రమేష్‌, అక్కపెల్లి అరవింద్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంద ర్భంగా తాడ్వాయి మండల అధ్యక్షులు ఆలం శీను మాట్లాడుతూ తనకు ఇంత గొప్ప సహాయం చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు రాముకు, జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ మహమ్మద్‌ యాసిన్‌ కి, రాష్ట్ర అధ్య క్షుడు మొగుళ్ళ భద్రయ్యకు, ములుగు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love