– తలకొండపల్లి ఎస్‌ఐ వెంకటేష్
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. మంగళవారం ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోమవారం వెంకటాపూర్ తండా గేటు వద్ద రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్‌ను గుర్తించి సిబ్బంది ఆపారు. వివరాలు అడగ్గా తనది అమన్‌గల్ మండలం అని డ్రైవర్ తెలిపాడు. ఇసుక తీసుకెళ్లడానికి అనుమతి ఉందా అని ప్రశ్నించగా, ఎలాంటి పత్రాలు చూపించలేదు. దీంతో టిప్పర్‌ను స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.