బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిన ఇల్లందు

– జీఎం జాన్‌ ఆనంద్‌ వివరాలు వెల్లడి
నవతెలంగాణ-ఇల్లందు
ఏప్రిల్‌ నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినట్టు జీఎం జాన్‌ ఆనంద్‌ తెలిపారు. కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏప్రిల్‌ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. 3.05 లక్షల టన్నులకుగాను 3.29 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 102 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే 1.05 లక్షల టన్నుల బొగ్గును రైల్వే మార్గం ద్వారా, 0.42 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, ఆర్‌సీహెచ్‌పీ ద్వారా 2.00 లక్షల టన్నులు మొత్తం 3.47 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేశామన్నారు. ఏప్రిల్‌ నెలలో 28 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేశామని తెలిపారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులకు, సూపర్‌వైజర్స్‌, యూనియన్‌ నాయకులకు, ఉద్యోగులకు జీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Spread the love