అక్రమ కేసులు ఎత్తివేయాలి

Illegal cases should be dropped– మాచారెడ్డి మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్న 
నవతెలంగాణ –  కామారెడ్డి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమి తండా గ్రామానికి సంబంధించిన పోడు రైతులతో కలిసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గతంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని మాచారెడ్డి మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించరు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, పాడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, రైతుల పంటలను కరాబ్ చేసిన ఫారెస్ట్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు బనాయించి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అన్నారు. నడిమీ తండకు సంబంధించి  భూక్య నరహరి తండ్రి పూల్యా, భూక్య మాన్సింగ్, భూక్య రవి లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీల నాయకులు గిరిజనుల ఓట్ల కోసం హామీలిచ్చి గద్దలెక్కిన తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లిమ్యా నాయక్, నరహరి, మాన్సింగ్, మాలోత్ రాజు, భూక్య,  బంగ్యా,  భూక్య దరి, భూక్య రవి, భూక్య వసరం, భూక్యచందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love