కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ మండలం మంచిరేవుల గ్రామంలోని విశ్వభారతి ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ రత్నారెడ్డి, నార్సింగ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పి.సత్యబాబులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఆరు నెలల జైలు, రూ.రెండు వేలు చొప్పున జరిమానా విధించింది. అప్పీల్‌ కోసం తీర్పు అమలును పది రోజులు సస్పెన్షన్‌లో ఉంచింది.రెండు ఎకరాల లీజు భూమిలో నిర్మాణాలకు అనుమతులు చేయడంతో మున్సిపాల్టీ నోటీసులు ఇచ్చింది.

Spread the love