నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ప్రత్యేక ఆర్డినేన్స్ ద్వారా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చవాన్, వలభోజు గోపి క్రిష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని మాధవ నిలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ఎన్.సీటిఈ నిబంధనలకు అనుగుణంగా 2025 1 సెప్టెంబర్ లో సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడిందని దీనితో ఆందోళన చెందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 65 రివ్యూ పిటిషన్ వేశారన్న్నారు. నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్ట్ ఆ రివ్యూలను కొట్టివేస్తూ 2028 ఆగష్టు 31 లోపు ఇన్ సర్వీస్ టీచర్స్ కు చివరి అవకాశంగా తీర్పు ఇచ్చిందని దీని ప్రకారం సర్వీస్ రిమూవ్ చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో 30000 మంది ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ప్రత్యేకంగా 2సార్లు టెట్ నిర్వహణ చేస్తామనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాస్త ఊరట మాత్రమేనన్నారు.
విద్యా హక్కు చట్టం అమలు ద్వారా టెట్ అంశం ప్రస్తావన జరిగిందని ఏప్రిల్ 1,2010 పూర్వం న్యాయ బద్దంగా నోటిఫికేషన్ వచ్చి నియామకం అయిన ఉపాధ్యాయులకు ఆనాడు టెట్ అవసరం లేదని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ లో టెట్ అర్హత ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ 1,2010 ఆర్.టిఎఫ్ రూల్స్ అనుగుణంగా ఎన్సిటిఈ టెట్ నిబంధనలు చేర్చిందని, నిబంధనల ఆధారంగానే సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిందన్నారు. ఇది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అన్యాయం కల్గిస్తుందని గత 30 సంవత్సరాలనుండి ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్న విషయంలో భోదిస్తున్నారు. టెట్ లో మాత్రం అన్ని విషయాలు కలిపి పరీక్షలు పెట్టడం జరుగుతుందని భాషా ఉపాధ్యాయులకు, ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా తమ బోధన కు సంబంధం లేని సబ్జెక్టు చదవి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అలాంటిప్పుడు ప్రత్యేకంగా టెట్ ఎన్ని సార్లు పెట్టిన ప్రయోజనం లేదనే భావన ఉపాధ్యాయుల్లో ఉందన్నారు. సమావేశంలో తపస్ ఆర్థిక కార్యదర్శి ఉదార్ కేశవ్, జిల్లా కార్యదర్శులు దొంతుల విలాస్,కడుకుంట్ల అనిల్, నాందేవ్, గోపాల్ కాంబ్లె, గంభీర్ పాల్గొన్నారు.



