జనవరి నెలలో ఆర్ జి-3 ఏరియా ఉత్పత్తి 113 శాతం 

– అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఉత్పత్తి 120 శాతం 
నవతెలంగాణ-రామగిరి
జనవరి నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా వివరాలను ఆర్.జి-3 ఏరియా జిఎం ఎన్ సుధాకరరావు, ఏపీఏ  జీఎం కె.వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఆర్.జి.3 ఏరియా జిఎం  ఎన్. సుధాకరరావు మాట్లాడుతూ.. జనవరి నెలలో ఆర్.జి.3 ఏరియాకు నిర్దేశించిన 5.70 లక్షల టన్నులకు గాను 6.42 లక్షల టన్నులు అనగా 113 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు 100 శాతం మట్టి తీయడం 8.86 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. ఓ.సి-2 ఉపరితల గని విస్తరణ కోసం చేపట్టినటువంటి భూ సేకరణ ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామాల ప్రజలు సహకరించాలన్నారు. వారికి చట్ట ప్రకారం రావాల్సిన వాటన్నింటినీ ఇవ్వడంకోసం సంస్థ యాజమాన్యం కృషి చేస్తుందన్నారు.
అలాగే అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా  
జిఎం కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జనవరి నెలలో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాకు నిర్దేశించిన 1.49 లక్షల టన్నులకుగాను 1.79  లక్షల టన్నులు అనగా 120 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు 1.88 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా పని చేయడానికి కృషి చేస్తామన్నారు.అందరు కలసి కట్టుగా పనిచేసి భద్రత తో నిర్దేశించిన లక్ష్యాలను సాధించు కోవాలని, ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరానికి ఏరియా లకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించడానికి అందరు కృషి చేయాలని వారు అన్నారు.
Spread the love